Beauty TipsHealthhealth tips in telugu

15 రోజుల్లో ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం: ఈ ఒక్క స్పూన్ నూనెతో!

Coconut Hair fall control oil at home In Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య కనపడుతుంది.

జుట్టు రాలటం ప్రారంభం కాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెను వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీని కోసం కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె ఏదైనా వాడవచ్చు. ఒక గిన్నె పెట్టి దానిలో 100 గ్రాముల కొబ్బరి నూనె వేసి దానిలో రెండు మందార పువ్వులను కింద తొడిమలు,పుప్పొడి కాడలను తీసేసి వెయ్యాలి. నూనెలో మందార పూలు బాగా వేగే వరకూ మరిగించాలి.

మందార పువ్వులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక నూనెను వడగట్టాలి. ఈ నూనెను మనం నార్మల్ గా రాసుకొనే నూనెకు బదులుగా ప్రతి రోజు రాసుకుంటూ ఉండాలి.

ఈ విధంగా ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే తలలో కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా తల మీద చర్మం మీద తగినంత తేమ ఉండి చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం అని చెప్పాలి.

మందార పువ్వులను పురాతన కాలం నుండి జుట్టు సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ నూనెను రెగ్యులర్ గా రాసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. ఈ నూనె కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ నూనెను వాడి జుట్టు రాలే సమస్య నుండి బయట పడండి.

మా ఇంటిలో ఈ నునేను కొన్ని నెలల నుండి వాడుతున్నాను. జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అయితే రెగ్యులర్ గా వాడితేనే పలితం ఉంటుంది. ఎదో రెండు రోజులు రాసుకొని పలితం లేదని అనుకోకూడదు.

రెగ్యులర్ గా నెల రోజుల పాటు ఈ నునేను వాడితే మంచి పలితాన్ని పొందవచ్చు. కాబట్టి వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."