Healthhealth tips in telugu

మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ శాశ్వతంగా తగ్గాలంటే ఇలా చేయండి!

Joint Pains HomeRemedies : ఒకప్పుడు కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు అనేవి అరవై సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేవి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా చిన్న వయస్సులోనే అంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. నొప్పులు ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

దీని కోసం ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు, అరస్పూన్ శొంఠి పొడి,అరస్పూన్ దాల్చినచెక్క పొడి, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.

☛ Also Read: రేటు కాదు.. రిజల్ట్ చూడండి: ఈ పండు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి దాని మీద ఒక క్లాత్ చుట్టి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
weight loss tips in telugu
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు శొంఠి పొడి వేసి మూత పెట్టి పది నిమిషాలు అలా వదిలేయలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటివి అన్నీ తొలగిపోతాయి. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

☛ Also Read: నిద్ర మాత్రలు వద్దు.. ధనియాలతో ఈ చిన్న చిట్కా పాటిస్తే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు!

పసుపు, శొంఠి, దాల్చిన చెక్కలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ పొడులను మార్కెట్ లో కొనటం కన్నా ఇంటిలో తయారుచేసుకోవటం మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

☛ Also Read: ఈ సీజన్‌లో పనస పండును మిస్ అయితే.. ఈ అద్భుత లాభాలు కోల్పోయినట్లే!

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."