Kitchenvantalu

వాడేసిన టీ పొడిని చెత్తలో వేస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!

Used Tea Powder benefits :వాడేసిన టీ పొడిని చెత్తలో వేస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.. మనం సాదారణంగా రోజులో రెండు సార్లు టీ తాగుతూ ఉంటాం.

అలా టీ తాగినప్పుడు టీ వడకట్టి టీ పొడిని పాడేస్తూ ఉంటాం. అలా పాడేసే టీ పొడిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పొడిని మొక్కలకు ఎరువుగా వేయవచ్చు.అలాగే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

మనం పూరి లేదా చపాతీలోకి ఛోలే మ‌సాలా చేసుకుంటూ ఉంటాం. వాడేసిన టీ పొడిని శుభ్రంగా కడిగి మరల ఆ పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి ఛోలే మ‌సాలాలో కలిపితే కూర‌కు మంచి వాస‌న, రంగు వస్తుంది.

అలాగే ఈ నీటితో ఫ‌ర్నీచ‌ర్ ని శుభ్రం చేస్తే కొత్తవాటి వలే మెరుస్తాయి. ఈ నీటిని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే జుట్టు మేరవటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

ఈ నీటిలో మంచి సువాసన కోసం ముఖ్యమైన నూనెలు కొన్ని చుక్కలు వేసి రూమ్ ఫ్రెషనర్‌ గా వాడవచ్చు. కూరగాయల కట్టింగ్ బోర్డుపై నల్ల మచ్చలు ఉంటే తొలిగించుకోవచ్చు.

చాపింగ్ బోర్డ్ నుండి మరకలను తొలగించడానికి ఈ నీటిలో నిమ్మరసం, డిష్ వాషింగ్ లిక్విడ్ సోప్ కలపాలి. ఈ మిశ్రమంతో చాపింగ్ బోర్డ్‌ను శుభ్రం చేస్తే మరకలు అన్ని తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."