జుట్టు రాలిపోతోందా? 3 రోజుల్లో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా!
Tea Hair loss treatment in telugu :మనం సాధారణంగా ప్రతిరోజు టీ తాగుతూ ఉంటాం. అలా టీ తాగితే ఆ రోజంతా హుషారుగా ఉంటుంది అయితే Tea జుట్టుకి సంబందించిన సమస్యల పరిష్కారానికి చాలా బాగా సహాయపడుతుంది.
ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల Tea Powder వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి చల్లారనివ్వాలి.చల్లారిన టీ డికాషన్ స్ప్రే బాటిల్ లో వేసి తలకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక తల స్నానం చేయాలి.
Tea డికాషన్ అనేది జుట్టుకు మంచి కండిషనర్ గా ఉపయోగపడుతుంది. జుట్టు చిక్కులు లేకుండా ఉంటుంది. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండటానికి పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది తెల్లజుట్టును నల్లగా మార్చే డయింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.
☛ Also Read: 24 గంటలు ఏసీలోనే ఉంటున్నారా? ఈ షాకింగ్ నిజాలు మీ కోసమే!
టీ లో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ వైరల్ క్రిమినాశక లక్షణాలు ఉండటం వలన తల మీద దురద తగ్గించటానికి సహాయపడుతుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.
పోషకాలు యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల అలాగే కెఫిన్ ఉండటం వలన జుట్టు యొక్క కుదుళ్లలోకి చొచ్చుకుని వెళ్లి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
☛ Also Read: Face Glow Tips: బ్యూటీ పార్లర్ తో పనిలేకుండా… ఇంట్లోనే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు రాలటానికి కారణమైన DHT అనే హార్మోన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
☛ Also Read: తెల్ల జుట్టుతో విసిగిపోయారా? 4 కుంకుడు కాయలతో ఈ అద్భుతమైన చిట్కా ట్రై చేయండి!
Source: chaipakodi.com

