Kitchenvantalu

నోరూరించే కేరళ ఎగ్ కర్రీ: ఈ స్టైల్ లో ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Kerala Egg Curry Recipe :నోరూరించే కేరళ ఎగ్ కర్రీ: ఈ స్టైల్ లో ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. రోటీ,అన్నం లోకి సూపర్ కాంబినేషన్ కొబ్బరి పాల ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
గుడ్లు – 3
కొబ్బరి పాలు – ½ కప్పు
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
టమాటోలు – 2
పపుసు – ½ టీ స్పూన్

ఉప్పు – రుచికి సరిపడా
కారం – 1 టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
చింతపండు – కొద్దిగా

☛ Also Read: వాడేసిన టీ పొడిని చెత్తలో వేస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
తయారీ విధానం
1.ముందుగా గుడ్లను ఉడికించి రెండు బాగాలుగా కట్ చేసుకోవాలి.
2.పచ్చికొబ్బరి ని మిక్సి జార్ లోవేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసి గ్రైండ్ చేసి కొబ్బరి పాలను వడగట్టుకోవాలి.
3.ఇప్పుడు కూర కోసం ప్యాన్ లో ఆయిల్ వేసుకోని వేడెక్కాక ఆవాలు ,ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
4.వేగిన ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి వేసి ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి.
5.అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

☛ Also Read: వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే వంకాయ-టమాటో పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
6.మగ్గిన టమాటోలకి ఉప్పు,కారం,పసుపు మిరియాల పొడి,ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
7.మసాలాలు వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసి చిక్కపడే వరకు ఉడికించాలి.
8.చింతపండు ఉడికిన తర్వాత కొబ్బరిపాఉ యాడ్ చేసి మరికాసేపు మరగనివ్వాలి.
9.ఇప్పుడు అందులోకి కరివేపాకు,ఉడికించిన గుడ్లు వేసి ఐదునిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10.అంతే ఎంతో రుచికరమైనా కొబ్బరి పాల ఎగ్ కర్రీ రెడీ.

☛ Also Read: ఫంక్షన్ల స్టైల్ దొండకాయ 65: ఇంట్లోనే ఇంత సింపుల్‌గా చేయొచ్చని మీకు తెలుసా?

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."