చపాతీలు గట్టిగా వస్తున్నాయా? అయితే పొరలు పొరలుగా, సాఫ్ట్‌గా రావడానికి ఈ సీక్రెట్ తెలుసుకోండి!
Soft Chapati tips:చపాతీలు గట్టిగా వస్తున్నాయా? అయితే పొరలు పొరలుగా, సాఫ్ట్‌గా రావడానికి ఈ సీక్రెట్ తెలుసుకోండి.. చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటే తినటానికి ఇబ్బంది ఉండదు.
అయితే మనలో చాలా మందికి చపాతీలు మృదువుగా మెత్తగా రావటం లేదని చపాతీలను తినటం మానేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే మెత్తని మృదువైన చపాతీలను తయారుచేసుకోవచ్చు.

చపాతీలు మెత్తగా ఎన్ని గంటలైన మృదువుగా రుచికరంగా ఉండాలంటే చపాతి పిండి లో కొద్దిగా గోరు వెచ్చని పాలు పోసి పిండి కలిపితే చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా చపాతీ అంచులు అన్ని సమానంగా వచ్చి బాగా కాలతాయి.
చపాతీ పిండిలో 60 శాతం నీటిని,40 శాతం పాలను పోసి కలిపితే చపాతీలు చల్లారిన తర్వాత కూడా మెత్తగా,మృదువుగా ఉంటాయి. అలాగే తింటున్నప్పుడు ఎంతో కమ్మగా రుచిగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

