Beauty TipsHealthhealth tips in telugu

ముఖానికి ఆవిరి పడుతున్నారా? అయితే ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!

Face Steam Tips :ముఖానికి ఆవిరి పడుతున్నారా? అయితే ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే.. సాదారణంగా మనం జలుబు చేసినప్పుడు మాత్రమే ఆవిరి పడతాము. కొందరు ఫేషియల్ సమయంలో స్టీమింగ్ కి ప్రాధాన్యం ఇస్తారు. నిజానికి తరచూ ఇలా చేయుట వలన చర్మానికి చాలా మంచిది. దీనితో అనేక లాభాలు ఉన్నాయి.

ఆవిరి పట్టటం వలన మూసుకున్న చర్మ గ్రంధులు తెరుచుకుంటాయి. చర్మం లోపల ఉన్న మురికి బయటకు వచ్చేస్తుంది. మృత కణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్లాక్,వైట్ హెడ్స్ కూడా క్రమంగా దూరం అవుతాయి.

మొటిమలు ఉన్నవారు తరచూ నాలుగు నుంచి అయిదు నిముషాలు ఆవిరి పట్టాలి. ఆ తర్వాత ఐస్ ముక్కలతో రుద్దుకుంటే సమస్య తొందరగా తొలగిపోతుంది. అంతేకాక అలసట,ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

శ్వాస సంభందిత సమస్యలు కూడా తగ్గుతాయి. తలనొప్పితో బాధ పడేవారు నీళ్ళలో లావెండర్ నూనె వేసుకొని ఆవిరి పట్టుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

సైనస్ సమస్య ఉన్నప్పుడు యూకలిప్టిస్ నూనె,జిడ్డు చర్మం ఉన్నవారు రోస్మేరి నూనె,పొడి చర్మం ఉన్నవారు పిప్పర్మేంట్ ఆయిల్ ను ఆవిరి పట్టే సమయంలో ఉపయోగించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."