Beauty TipsHealthhealth tips in telugu

హెయిర్ ఫాల్‌కు చెక్: పెరుగును ఇలా వాడితే కేవలం వారంలో జుట్టు రాలడం ఆగిపోతుంది!

Curd Hair Fall And Dandruff Tips:హెయిర్ ఫాల్‌కు చెక్: పెరుగును ఇలా వాడితే కేవలం వారంలో జుట్టు రాలడం ఆగిపోతుంది.. చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య అనేవి తగ్గాలంటే చాలా సమయం పడుతుంది.

మనలో చాలా మంది చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య వచ్చినపుడు మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడి.. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉంటారు.

అలాంటి వారు ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్ లో దొరికే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం,ఒక స్పూన్ ఆవనూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు…అలాగే తల మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య తగ్గుతుంది.

పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తల మీద చుండ్రు లేకుండా చేయటానికి బాగా సహాయపడతాయి.

అలాగే తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా కెఃస్తుంది. ఈ చిట్కా కోసం ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే లభ్యం అవుతాయి.

అలాగే 2,3 చెంచాల పెరుగు, 4,5 స్పూన్ల ఉల్లిపాయ రసం తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 30నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ టిప్ ఫాలో అయితే జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరగడం స్పష్టంగా కనిపిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."