Kitchenvantalu

పక్కా కొలతలతో కమ్మని సేమియా పాయసం.. ఎన్ని గంటలైనా చిక్కబడదు!

Semiya Payasam: పక్కా కొలతలతో కమ్మని సేమియా పాయసం.. ఎన్ని గంటలైనా చిక్కబడదు.. ఈజీగా,టేస్టీగా,ఫాస్ట్గ్ గా చేసుకునే స్వీట్ అంటే సేమియా పాయసమే. స్పెషల్ ఏదైనా సరే సేమియా స్వీట్ ఉండి తీరాల్సిందే. సేమీయా పాయసం తయారీ చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్
సేమియా – 1 కప్పు
సగ్గుబియ్యం – ¼ కప్పు
పాలు -1 లీటర్
పంచదార – ¾ కప్పు
పటికబెల్లం – ¼ కప్పు
బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్
ఎండు ఖర్జూరాలు – 2 టేబుల్ స్పూన్
పిస్తా పలుకులు- 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టేబుల్ స్పూన్స్
నీళ్లు 1 ¼ కప్పు

తయారీ విధానం
1.నెయ్యిలో సేమియా వేసి ఎర్రగా వేపుకోవాలి.
2.మిగిలిన నెయ్యిలో ఖర్జూరం,పిస్తా,వేపుకోవాలి.
3.చిక్కని పాలల్లో పావుకప్పు నీళ్లు పోసి రెండు పొంగులు రానివ్వాలి.

4.మిగిలిన నీళ్లు మరిగించి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి.
5.సగ్గుబియ్యం రంగు మారాక అందులోకి పటిక బెల్లం,యాలకుల పొడి వేసి మరిగించాలి.
6.అందులోకి పంచదార వేపుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ వేసి రెండు నిమిషాలు మరిగించాలి.
7.రెండు నిమిషాల తర్వాత సేమియా కాస్త మెత్త పడుతుంది.
8.కాచిన పాలను కలుపుకోని సర్వ్ చేసుకోవడమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."