బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ రాగి దోశ తింటే వదిలిపెట్టరు!
Ragi dosa:బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ రాగి దోశ తింటే వదిలిపెట్టరు! బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలన్నది ప్రతి రోజూ మహిళల ముందున్న పెద్ద ప్రశ్న. ఆరోగ్యంతో పాటూ రుచిగా ఉండాలంటే ఒకసారి రాగి దోశెను చేసుకుని తింటే సరిపోతుంది. రాగి దోశ ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది.
“రాగులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో క్యాల్షియం, ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు త్వరగా తగ్గాలనుకునే వారికి, మధుమేహం (షుగర్) అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ‘రాగి దోశ’ ఒక అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పవచ్చు.

సాధారణంగా రాగులు అనగానే రుచిగా ఉండవని చాలామంది, ముఖ్యంగా పిల్లలు తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా పిండి కలుపుకుని క్రిస్పీగా, టేస్టీగా రాగి దోశలు వేసి ఇస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా కమ్మగా తినేస్తారు.
ఉదయాన్నే రోజూ తినే ఇడ్లీ, మామూలు దోశలకు బదులుగా ఇలా వారానికి రెండు సార్లయినా రాగి దోశలను మీ డైట్ లో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా మారడంతో పాటు, అనేక అనారోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు.”
కావలసిన పదార్ధాలు
1 కప్పు రాగులు
½ కప్పు బియ్యం
¼ కప్పు మినప పప్పు
నూనె తగినంత
ఉప్పు రుచికి సరిపడా
వంట సోడా చిటికెడు
తయారి విధానం
ముందుగా రాగులను, బియ్యాన్ని, మినపపప్పును నీటితో బాగా కడిగి మరలా నీళ్ళు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిండి చిక్కటి మజ్జికలా ఉండాలని గుర్తుపెట్టుకొండి. అప్పుడే దోస మంచి మందంగా వస్తుంది.
పిండిని గిన్నెలోకి తీసుకోని రుచికి సరిపడ ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసి మొత్తం పిండిని ఒక 10 నిమిషాల పాటు పిండి పైకి పొంగేలా గిల కొట్టుకోవాలి. ఇలా గిల కొట్టడం వల్ల పిండి లోకి గాలి చేరి దోసలు వేసినప్పుడు పొంగుతూ చాలా బాగా రుచిగా వస్తాయి.
ఇక పొయ్యి మీద పెనం పెట్టి ఏ పిండితో dosaలు వేస్తే చాలా బాగా వస్తాయి.

