Healthhealth tips in telugu

రోజుకు ఈ ఒక్క లడ్డూ చాలు.. నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఇట్టే మాయం!

calcium Laddu :రోజుకు ఈ ఒక్క లడ్డూ చాలు.. నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఇట్టే మాయం.. ఈ రోజుల్లో సమస్యలు అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది.

అసలు సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి వంటివి వచ్చేస్తున్నాయి.

అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం రావటమే కాకుండా వేసవిలో వచ్చే నీరసం,నిస్సత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేయటానికి ఇప్పుడు చెప్పే లడ్డు సహాయపడుతుంది. దీని కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అరకప్పు నువ్వులను దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి.

కప్పున్నర ఖర్జూరం తీసుకొని గింజలు తీసేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో వేగించి పెట్టుకున్న నువ్వులను కలిపి చిన్న చిన్న లడ్డులుగా చేసుకొని రోజు ఒక లడ్డు తినాలి.

వీటిని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిలో calcium సమృద్దిగా ఉండుట వలన చాలా తొందరగానే మార్పు అనేది కనిపిస్తుంది.

నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనకు నువ్వులు,ఖర్జూరం రెండూ సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ లడ్డులను తయారుచేసుకొని తింటే చాలా మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."