Beauty TipsHealthhealth tips in telugu

విపరీతంగా జుట్టు రాలుతోందా? 15 రోజుల్లో రెట్టింపు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి!

Hair Fall Home Remedies In telugu :విపరీతంగా జుట్టు రాలుతోందా? 15 రోజుల్లో రెట్టింపు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి.. మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణంలో కాలుష్యం. ఒత్తిడి, కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వలన జుట్టుకి సంబందించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

మన పూర్వీకులు వంటింటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలను వాడటం వలన జుట్టు సమస్యలు అసలు ఉండేవి కాదు.కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూస్తున్నారు.

జుట్టు రాలే సమస్య తగ్గించడానికి అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి జుట్టు రాలిపోయి బట్టతల గా మారకుండా ఉండటానికి మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది. చాలామంది జుట్టు రాలడం ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొనేస్తు వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

వాటి కారణంగా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది అది ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే జుట్టురాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతూ జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాము.

ఒక స్పూన్ బియ్యం,ఒక స్పూన్ మెంతులు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులు,బియ్యంలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ అల్లం రసం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

మెంతులు, బియ్యం, అల్లంలో ఉన్న పోషకాలు చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటి జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి సహాయ పడుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ చిట్కాను ట్రై చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."