ఒక్కసారి వాడితే చాలు! గ్యాస్, ఎసిడిటీ మాయం.. 100% రోగనిరోదక శక్తి గ్యారెంటీ!
Gas problem home remedy in telugu: నమస్కారం అండి! ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల మనలో చాలామంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో రోజూ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఏం తిన్నా అరగకపోవడం, కడుపులో మంట, అసలు ఆకలే వేయకపోవడం లాంటివి చాలా చికాకు తెప్పిస్తాయి కదా.
అయితే, వీటన్నింటికీ చెక్ పెడుతూ, మన రోగనిరోదక శక్తిని (Immunity) ఏకంగా 100% పెంచే ఒక అద్భుతమైన నాచురల్ చిట్కాను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను.
ఇది ఒక్కసారి వాడితే చాలు.. మీ కడుపు ఉబ్బరం, మంట పూర్తిగా తగ్గిపోయి, మళ్ళీ మంచిగా ఆకలి వేయడం మొదలవుతుంది. మరి ఆ అద్భుతమైన రెమెడీ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి!
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఈ రోజుల్లో చాలా మందిని గ్యాస్, కడుపు ఉబ్బరం,కడుపులో మంట అనేవి వేదిస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటానికి మందులు వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

ఇప్పుడు చెప్పే చిట్కా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంటను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. దీని కోసం ఒక నిమ్మకాయను తీసుకొని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేయాలి. ఈ నిమ్మ ముక్కలపై కొంచెం మిరియాల పొడి,చిటికెడు ఉప్పు, కొంచెం శొంఠి పొడి జల్లాలి.
పొయ్యి మీద పెనం పెట్టి కాస్త వేడెక్కాక, పెనం మీద రెడీ చేసిన నిమ్మకాయ ముక్కలను పెట్టి కొంచెం సేపు వేడి చేస్తే నిమ్మకాయ ముక్క మీద జల్లిన ఉప్పు,మిరియాల పొడి, శొంఠి పొడి అన్నీ నిమ్మకాయలో కలుస్తాయి. ఈ నిమ్మకాయ ముక్కల నుండి రసాన్ని తీయాలి.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పైన తయారుచేసుకున్న నిమ్మరసం ఒక స్పూన్ వేసి కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ చిట్కా ఆకలి లేనివారికి ఆకలిని పుట్టిస్తుంది.
మిరియాలు, శొంఠి పొడిలో ఉన్న లక్షణాలు గ్యాస్ వంటి జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మన ఇంటిలో అందుబాటులో ఉండేవే. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి ఈ సమస్యల నుండి బయట పడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

