బ్యూటీ పార్లర్ పనిలేదు.. జాజికాయతో ఇలా చేస్తే మీ ముఖం నిగనిగలాడటం ఖాయం!
Nutmeg Face Glow Tips : అందంగా, కాంతివంతంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ రోజూవారీ తిరుగుళ్లు, కాలుష్యం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వచ్చేసి స్కిన్ డల్ అయిపోతుంటుంది. దీనికోసం వేలకు వేలు ఖర్చుపెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని అస్సలు లేదు.
మన వంటగదిలో ఉండే ‘జాజికాయ’ చర్మ సమస్యలకు చెక్ పెట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో చిన్న ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు.. మీ ముఖం ముత్యంలా మెరిసిపోతుంది. ఇంతకీ ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలి? దీన్ని వాడే సరైన విధానం ఏంటో ఈ ఆర్టికల్‌లో చూసేయండి.
మనలో చాలా మంది ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా సిద్దంగా ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖం మీద ముడతలు,నల్లని మచ్చలను మాయం చేయవచ్చు.
ముఖం మీద మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు.

మనం మసాలా దినుసుగా వాడే జాజికాయ చర్మ సౌందర్యంలో చాలా బాగా సహాయపడుతుంది. పురాతన కాలం నుండి జాజికాయను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.
దీనికోసం జాజికాయ పొడిని తీసుకోవాలి. ఒక బౌల్ లో అర స్పూన్ జాజికాయ పొడి, పావు స్పూన్ చందనం పొడి వేసి నీటితో పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మొటిమలు,నల్లని మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి
ఒక బౌల్ లో అర స్పూన్ తేనె వేసుకొని దానిలో పావు స్పూను జాజికాయపొడి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ పాలు వేసి దానిలో పావు స్పూను జాజికాయపొడి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంటయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముడతలు తొలగిపోయి ముఖం యవ్వనంగా మృదువుగా మారుతుంది. కాబట్టి ఈ చిట్కాలను ట్రై చేసి అందమైన కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

