Healthhealth tips in telugu

కూరలో ఆవాలు ఏరి పారేస్తున్నారా? ఈ నిజం తెలిస్తే మళ్లీ ఆ తప్పు చేయరు!

Mustard seeds Benefits : మనం రోజూ వండుకునే కూరల్లో తాలింపు వేయాలంటే ఆవాలు ఉండాల్సిందే. కానీ, అన్నం తినేటప్పుడు కూరలో ఆవాలు తగిలితే చాలు.. చాలామంది వాటిని చిరాకుగా ఏరి పక్కన పెట్టేస్తుంటారు. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా?

అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. చూడ్డానికి ఎంతో చిన్నగా కనిపించే ఆవాల్లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి. ఆవాలను ఏరి పారేయడం వల్ల మనం ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నామో, వాటిని డైరెక్ట్‌గా తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం రండి!

ఆవాలు అనేవి మన వంటగదిలో పోపుల పెట్టెలో ఉండే ఒక దినుసు. అవాలులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ప్రతి రోజు ప్రతి ఇంటిలో కూరలు చేసినప్పుడు తాలింపులో తప్పనిసరిగా వాడతారు. ఆవాలు వంటకు మంచి రుచిని,వాసనను అందిస్తుంది. అవాలులో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
Mustared oil Benefits in telugu
పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొన్ని ఆవాలు వేసి ఆ నీటిని వడకట్టి పుక్కిలిస్తే పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఏమైనా గాయాలు అయినప్పుడు వాటిపై ఆవపొడి రాస్తే త్వరగా తగ్గుతాయి. ఒక స్పూన్ ఆవపొడిలో తేనే కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

కీళ్లనొప్పులు ఉన్నవారికి ఆవాలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుంది.

ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి. ఆవనూనెను తలకు పట్టిస్తే జట్టు రాలకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్య కూడా పోతుంది.

ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జట్టు మృదువుగా మారుతుంది.ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."