Beauty TipsHealthhealth tips in telugu

ఒక్క అరటిపండుతో మీ జుట్టు రాలడం ఆగి, పొడవుగా పెరుగుతుంది.. ఎలాగంటే!

Banana Hair Pack : రోజూ దువ్వెన నిండా రాలుతున్న జుట్టును చూసి టెన్షన్ పడుతున్నారా? మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా? అయితే మీ ఇంట్లో ఎప్పుడూ ఉండే ‘అరటిపండు’తోనే ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టొచ్చు. అవును, మీరు విన్నది నిజమే! అరటిపండు కేవలం ఆరోగ్యానికే కాదు, జుట్టు అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ పోస్ట్‌లో.. ఎలాంటి కెమికల్స్ లేకుండా అరటిపండును ఉపయోగించి జుట్టు రాలడాన్ని ఎలా ఆపాలి, అలాగే జుట్టును ఒత్తుగా, పొడవుగా ఎలా పెంచుకోవాలి అనే ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఇంటి చిట్కాను మీతో పంచుకోబోతున్నాను. ఓసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు

జుట్టు రాలే సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలే సమస్య,జుట్టు చివర్లు చిట్లటం, చుండ్రు సమస్యలను తగ్గించటానికి ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అరటిపండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం వస్తుంది. అరటిపండులో ఉన్న విటమిన్ లు,మినరల్స్ జుట్టు రాలకుండా సహాయపడతాయి.

మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అరటిపండు,కాఫీ పొడి,పెరుగు ఈ మూడు కలిపి జుట్టు సమస్యలకు ఒక మేజిక్ వలె పనిచేస్తాయి. అరటిపండులో పొటాషియం, ప్రోటీన్, సహజ నూనెలు తల మీద తేమ ఎక్కువగా ఉండేలా చేస్తాయి. పెరుగు తల మీద చర్మం తేమగా ఉండేలా చేసి చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."