Beauty TipsHealthhealth tips in telugu

పార్లర్‌కి వెళ్లే పనే లేదు.. ఈ చిన్న చిట్కాతో మీ ముఖం నిగనిగలాడటం ఖాయం!

Face Black spots Tips In telugu : ఆఫీస్ పనులు, ఇంటి బాధ్యతలతో రోజంతా బిజీగా ఉండి బ్యూటీ పార్లర్‌కి వెళ్లే సమయం దొరకట్లేదా? సడెన్‌గా ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీకి వెళ్లాల్సి వస్తే ముఖం డల్‌గా ఉందని ఫీల్ అవుతున్నారా? ఇకపై ఆ టెన్షన్ అస్సలు వద్దు! మన వంటగదిలో ఉండే సహజమైన వస్తువులతోనే కేవలం 10 నిమిషాల్లో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

వేల రూపాయలు ఖర్చు చేయకుండా, పార్లర్ ఫేషియల్ చేసిన తర్వాత వచ్చే గ్లోని ఇంట్లోనే ఎలా పొందాలో ఈ పోస్ట్‌లో వివరంగా చెబుతాను. ఈ సింపుల్ చిట్కాతో మీ ముఖం తెల్లగా, మృదువుగా మెరిసిపోవడం ఖాయం

మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా ఉండదు. అలాగే ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది.

ఈ సమస్యకు ఇంటిలోనే మంచి పరిష్కారం ఉంది. వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఒక స్పూన్ నల్ల నువ్వులను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ నువ్వుల పొడి,పావు స్పూన్ పసుపు వేసి కొంచెం నీటిని పోసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని మంగు మచ్చలు,నలుపు,తెలుపు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నల్ల నువ్వులలో ఉండే లక్షణాలు మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు మచ్చలను తొలగించి చర్మం ఆరోగ్యంగా అందంగా తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఈ మచ్చలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."