ఇది ఒక్కసారి తీసుకుంటే చాలు.. గ్యాస్, ఎసిడిటీ మాయం, ఇమ్యూనిటీ డబుల్!
Gas Home remedies in Telugu : ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, సమయానికి భోజనం చేయకపోవడం, బయటి ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు దాదాపు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి.
ఏదైనా కొంచెం ఘాటుగా తిన్నా లేదా సమయం దాటినా కడుపులో మంట రావడం, ఆకలి పూర్తిగా మందగించడం లాంటివి మనం తరచుగా చూస్తుంటాం. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే ఏవో గ్యాస్ మాత్రలు వేసుకుని తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంటాం.
కానీ, ఎలాంటి మందులు వాడకుండా మన వంటగదిలో ఉండే సహజమైన వస్తువులతోనే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? ఈ రోజు నేను చెప్పబోయే ఈ చిన్న చిట్కాను వాడితే చాలు.. మీ కడుపు ఉబ్బరం, గ్యాస్, మంట అన్నీ ఇట్టే తగ్గిపోతాయి. అంతేకాదు, ఇది మీ రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచి, మందగించిన మీ ఆకలిని కూడా మళ్లీ పుట్టిస్తుంది.
మరి మన జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, పూర్తి ఆరోగ్యాన్నిచ్చే ఆ అద్భుతమైన ఇంటి వైద్యం ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం రండి!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మారిన జీవన శైలి, అలవాట్లు కారణంగా ప్రతి ఒక్కరిలోనూ గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు తగ్గడానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం.

సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వచ్చు. అదే సమస్య పెద్దగా ఉంటే గనుక డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అర స్పూన్ జీలకర్ర వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించాలి.
ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగాలి. ఈ నీటిని తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, కడుపులో మంట తగ్గటమే కాకుండా ఆకలి లేని వారిలో ఆకలిని పెంచుతుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు రోజులో రెండు సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నీటిని రోజు విడిచి రోజు తాగితే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. .
అంతేకాకుండా అధిక బరువు సమస్య తగ్గటానికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. అధిక బరువు., శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి ఈ డ్రింక్ తాగాలి అనుకుంటే ఏ సమయంలోనైనా తాగవచ్చు.
అదే గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు ఉదయం పరగడుపున తాగవచ్చు. లేదా సమస్య ఉన్నప్పుడు తాగవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

