చిగుళ్ల నొప్పులు, రక్తస్రావం వేధిస్తున్నాయా? కొబ్బరి నూనెతో ఈ ఒక్క పని చేసి చూడండి!
coconut oil benefits in telugu :నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చిగుళ్ల నుంచి రక్తం కారడం, పంటి నొప్పి, వాపు మరియు దంతక్షయం (Tooth Decay) వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడతాయి. అయితే మన వంటింట్లో సులభంగా దొరికే కొబ్బరి నూనెతో ఈ సమస్యలన్నింటికీ సహజంగా పరిష్కారం కనుగొనవచ్చని ఆయుర్వేదం మరియు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి.
కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను ఎలా నశింపజేస్తాయి, దీనితో సరైన పద్ధతిలో బ్రష్ ఎలా చేయాలి మరియు పాటించాల్సిన నియమాల గురించి ఈ ఆర్టికల్‌లో సమగ్రంగా తెలుసుకుందాం.
మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా? నిమ్మకాయ ఉందా?.. అది ఉందా ఇది ఉందా.. ఇలాంటి యాడ్స్ ని వినీ వినీ బోర్ కొట్టని తెలుగువారుండరు. రకరకాల ఫ్లేవర్లతో వచ్చిన టూత్ పేస్టుల కంటే సింపుల్ గా కొబ్బరి నూనె ఉపయోగిస్తే ఆరోగ్యకరమైన దంతాలు సొంతమవుతాయని చెబుతున్నారు నిపుణులు. పలు అధ్యయనాలు చేసిన తర్వాత కొబ్బరి నూనె చాలా శ్రేష్ఠమైనదని కనుగొన్నారు.

చిగుళ్ల ఆరోగ్యానికి:
కొబ్బరి నూనె చిగుళ్ల నుంచి రక్త స్రావం, వాపుని నివారిస్తుంది. అలాగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి చిగుళ్లలో పుండ్లు రాకుండా నివారిస్తుంది. అలాగే నాలుకని కొబ్బరి నూనెతో శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే ఫంగస్ ని నిర్మూలిస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. దంతాల ఆరోగ్యంపై ప్రభావం చూపించే ఇతర హానికారక క్రిములను సమూలంగా నాశనం చేయడంలో కొబ్బరినూనె పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుందని ఐరిష్ సైంటిస్టులు ప్రయోగాత్మకంగా కనిపెట్టారు.
కొబ్బరినూనె పేస్ట్ కి కావాల్సిన పదార్థాలు:
అరకప్పు కొబ్బరి నూనె
2 స్పూన్ల బేకింగ్ సోడా
తగినంత పెప్పర్ మెంట్ ఆయిల్ (ఇది ఇష్టమైన వారు వేసుకోవాలి)
తయారి విధానం
అన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలపాలి. పేస్ట్ లా తయారయ్యే వరకు బాగా మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. దీనిని సాధారణ పేస్ట్ లకు బదులుగా వాడితే మంచి ఫలితం లభిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

