Beauty TipsHealthhealth tips in telugu

అరటి తొక్కతో ముఖాన్ని 5 నిమిషాల్లో కాంతివంతంగా మార్చే సహజ చిట్కా!

Banana Peel Benefits For Skin: : అరటిపండు తిన్న తర్వాత చాలామంది తొక్కను నిరుపయోగంగా భావించి చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ ఆ తొక్కలో పండు కంటే ఎక్కువ స్థాయిలో విటమిన్ బి6, బి12, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం మరియు లూటిన్ వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయని చాలామందికి తెలియదు.

ఎండ తీవ్రత వల్ల వచ్చే ట్యాన్, వాయు కాలుష్యం కారణంగా ముఖంపై పేరుకుపోయే జిడ్డు, మురికిని తొలగించడంలో అరటి తొక్క అద్భుతంగా పనిచేస్తుంది. అత్య వసరంగా ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేకుండా కేవలం 5 నిమిషాల్లో అరటి తొక్కతో ముఖానికి సహజసిద్ధమైన మెరుపును (Instant Glow) తీసుకురావచ్చు.

ఈ పోస్ట్‌లో అరటి తొక్కను ముఖానికి ఎలా ఉపయోగించాలి, నల్లటి మచ్చలు మరియు ట్యాన్ తొలగించుకోవడానికి అనుసరించాల్సిన సరైన పద్ధతులను వివరంగా తెలుసుకుందాం.
banana peel
ఈ మధ్య కాలంలో అందం పట్ల శ్రద్ద పెరిగి ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరు కుంటున్నారు. అలా కోరుకోవటం కూడా సహజమే. ముఖం అందంగా తెల్లగా మెరవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వేల కొద్ది డబ్బును బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది. దీని కోసం ఒక బౌల్ లో అరస్పూన్ శనగపిండి, అరస్పూన్ బియ్యంపిండి, అరటి తొక్క మెత్తని పేస్ట్ ఒక స్పూన్, అరస్పూన్ ఆలోవెరా జెల్ వేసి సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు, తాన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. అరటిపండు తొక్కలో ఉన్న లక్షణాలు ముఖం మీద మచ్చలను తొలగించటానికి, బియ్యంపిండి,శనగపిండిలో ఉన్న లక్షణాలు మృత కణాలను తొలగిస్తుంది. ఆలోవెరా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."