జుట్టు విపరీతంగా రాలుతోందా? కరివేపాకు నూనెను ఇలా వాడితే 15 రోజుల్లో ఒత్తైన, నల్లని జుట్టు గ్యారెంటీ!
Curry Leaves Hair Oil In telugu : కాలుష్యం, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోవడం మరియు చిన్న వయసులోనే పలచబడటం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు మన వంటింట్లో రోజూ వాడే కరివేపాకుతో సహజంగా జుట్టుకు కొత్త జీవం పోయవచ్చు.
కరివేపాకులో ఉండే బీటా-కెరోటిన్, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలంగా మార్చి రాలడాన్ని అరికడతాయి.
ఈ ఆకులతో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను కలిపి సరైన పద్ధతిలో కాచి వాడితే జుట్టు వేగంగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా నల్లగా మెరుస్తుంది. ఈ పోస్ట్‌లో కరివేపాకు హెయిర్ ఆయిల్ (Curry Leaves Oil) తయారీ విధానం, అప్లై చేసే సరైన పద్ధతి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా చూద్దాం.

మారిన జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలటం ప్రారంభం కాగానే కంగారూ పడవలసిన అవసరం లేదు. మార్కెట్ లో దొరికే నూనెలను వాడవలసిన అవసరం లేదు.
ఇంటిలో తయారుచేసుకున్న నూనెను వాడితే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా,ఆరోగ్యంగా పెరుగుతుంది.ఈ చిట్కా కోసం ఉసిరిని ఉపయోగిస్తున్నాం. 4 ఉసిరికాయలను తురమాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయలు విరివిగా లభ్యం అవుతున్నాయి. ఒక పాన్ లో 100 ml ఆవనూనె పోసి దానిలో తురిమిన ఉసిరి, 5 కరివేపాకు రెబ్బలను ఆకులుగా విడతీసి వేయాలి.
ఈ పాన్ ని పొయ్యి మీద పెట్టి ఉసిరి తురుము,కరివేపాకు వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేయాలి. ఈ నూనెను వడకట్టాలి. ఈ నూనెను దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. రాత్రి సమయంలో ఈ నూనెను తలకు రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి తలకు Cap పెట్టుకొని పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఉదయం సమయంలో తలకు నూనె పట్టిస్తే 2 గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ నెల రోజుల పాటు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఉసిరి,కరివేపాకు, ఆవనూనెలో ఉండే పోషకాలు జుట్టుకి మంచి పోషణ అందిస్తాయి.
ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఉసిరికాయలు ఈ సీజన్ లో చాలా విరివిగా లభ్యం అవుతాయి. కరివేపాకు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ నూనెను తయారుచేసుకొని వాడి జుట్టు సమస్యల నుండి బయట పడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

