Healthhealth tips in telugu

కొబ్బరి నూనె + కర్పూరం మ్యాజిక్ కాంబినేషన్.. ఇలా రాస్తే జరిగే అద్భుతం తెలిస్తే షాక్ అవుతారు!

skin problems In Telugu :పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో కొబ్బరి నూనె, కర్పూరం కలయికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొబ్బరి నూనె చర్మానికి, జుట్టుకు పోషణనిచ్చే సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తే, కర్పూరంలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు నొప్పి నివారణ గుణాలు ఇన్ఫెక్షన్లను తరిమికొట్టడంలో తిరుగులేని ఔషధంగా పనిచేస్తాయి.

ఈ రెండింటి మిశ్రమాన్ని తలకు లేదా శరీరానికి రాసుకోవడం వల్ల మొండి చుండ్రు, తలలో దురద, జుట్టు విపరీతంగా రాలడం వంటి సమస్యలు కొద్ది రోజుల్లోనే తగ్గుతాయి.

అంతేకాకుండా కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు మరియు జలుబు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇది ఒక సహజ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. ఈ పోస్ట్‌లో కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి వాడే సరైన పద్ధతి, దానివల్ల కలిగే అద్భుతమైన లాభాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.

కర్పూరం, కొబ్బరి నూనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండూ ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెను తలకు ఒంటికి రాస్తూ ఉంటారు. కర్పూరాన్ని దేవునికి హారతి ఇవ్వటానికి ఉపయోగిస్తూ ఉంటారు.
cococnut Oil benefits in telugu
అయితే కొబ్బరినూనెలో కర్పూరం కలిపి రాస్తే ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరినూనెలో కర్పూరం వేసి బాగా కలిపి ఆ నూనెను మొటిమలు ఉన్న ప్రదేశంలో రాత్రి సమయంలో రాసి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే నల్లని మచ్చలు తొలగిపోతాయి.

ఎలర్జీ, దద్దుర్లు ఉన్నప్పుడు కూడా ఆ ప్రదేశంలో కర్పూరం కలిపిన కొబ్బరి నూనె రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చుండ్రు సమస్యకు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు కర్పూరం కలిపిన నూనెను కాస్త వేడి చేసి తలకు బాగా పట్టించి పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన గోర్లపై వచ్చే ఇన్ ఫెక్షన్స్ ని తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె ఆర్గానిక్ అయితే మంచి ఫలితాలు చాలా తొందరగా వస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."