రోగనిరోధక శక్తిని పెంచి డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ తింటే తిరుగుండదు!
Dabbakaya Benefits In telugu :ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం మరియు జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల నేడు చాలామందిని అధిక బరువు (Obesity), చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol), టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటికి తోడు శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) తగ్గడం వల్ల తరచూ అలసట, ఇన్ఫెక్షన్ల బారిన పడటం సాధారణమైపోయింది.
మందులపై మాత్రమే ఆధారపడకుండా మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ సహజంగా చెక్ పెట్టవచ్చు.
ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండెకు హాని చేసే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్‌ను కరిగించి శరీరానికి అద్భుతమైన వ్యాధినిరోధక శక్తిని అందిస్తాయి. ఈ పోస్ట్‌లో ఆ అద్భుత ఆహారాల వివరాలు, వాటిని రోజువారీ డైట్లో ఎలా చేర్చుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం.
సిట్రస్ జాతికి చెందిన దబ్బపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే బయోఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన వేసవికాలంలో ఈ దబ్బపండు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకొనే వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఈ ఎరుపు రంగు దబ్బపండులో లికోపిన్ ఉండటం వలన కొన్ని రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దీనిలో 40కిపైగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా పనిచేస్తుంది.
మనలో చాలామంది దబ్బకాయతో ఆవకాయ, పచ్చడి, పులిహార వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పప్పుకూరల్లో, చట్నీ, చింతపండు బదులుగా దబ్బపండు రసాన్ని వాడవచ్చు. దబ్బకాయ షర్బత్ చాలా మంచిది. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

