Kitchenvantalu

వంట గదిలో సమయం, శ్రమ ఆదా చేసే మ్యాజిక్ టిప్స్.. తెలిస్తే లైఫ్ చాలా సింపుల్ అవుతుంది!

Kitchen Hacks: రోజూ కిచెన్‌లో వంట చేయడం, కూరగాయలు కోయడం, గిన్నెలు క్లీన్ చేసుకోవడం వంటి పనులకే ఎక్కువ సమయం గడిచిపోతుంటుంది. ముఖ్యంగా ఉదయం పూట హడావుడిగా వంట చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురైతే మరింత ఆలస్యమవుతుంది.

కొన్ని తెలివైన కిచెన్ హ్యాక్స్ మరియు చిట్కాలు తెలుసుకుంటే గంటల తరబడి చేసే పనులను నిమిషాల్లో ముగించవచ్చు. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం, పప్పులు పురుగు పట్టకుండా నిల్వ చేయడం, గ్యాస్ మరియు సమయాన్ని ఆదా చేసే సరికొత్త వంటింటి ట్రిక్స్ మీ వంట పనిని మరింత సులభతరం చేస్తాయి. ఈ పోస్ట్‌లో ప్రతి ఒక్కరికీ రోజూ ఉపయోగపడే అత్యుత్తమ కిచెన్ హ్యాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
smart kitchen tips
వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే సమయం ఆదా అవ్వటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అటువంటి చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు రసం తీసి నిల్వ చేస్తూ ఉంటాం. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాల పాటు గోరువెచ్చటి నీటిలో వేసి ఉంచాలి.

నూనెలోకాని, నెయ్యిలో కాని కొంచెం బెల్లం ముక్కని వేస్తే దానిని గడ్డ కట్టకుండా ఆవుతుంది. నెయ్యి మరిగించే సమయంలో రెండు చిటికెలు ఉప్పు దానిలో వేశారంటే నెయ్యి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది.

పచ్చిమిరపకాయలు పండు రంగు రాకుండా ఉండాలంటే గాలి చొరబడని గట్టి మూతగల సీసాలో ఉంచి, చిటికెడు పసుపు చల్లి ఎండతగిలేలా ఉంచాలి.

పప్పుధాన్యాలు పురుగు పట్టి చెడిపోకుండా నిల్వ ఉండాలంటే పప్పుల్లో నాలుగు ఇంగువ పలుకులు వేసి ఉంచితే చాలు! పప్పులకు పురుగుపట్టదు. ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి.

పాత చేతి రుమాళ్ళు రెండింటిని తీసుకొని మూడు పక్కల కలిపి కుట్టి ఒక పక్క వదిలేయాలి. సంచిలా తయారైన దీనిని తడిపి అందులో ఆకు కూరలు పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వాడిపోకుండా తాజాగా వుంటాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."