Healthhealth tips in telugu

వారంలో 3 సార్లు ఇది తాగితే చాలు.. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, రక్తహీనత మాయం!

calcium rich foods In Telugu : కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, రక్తహీనత మరియు కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే ఈ సహజసిద్ధమైన పానీయాన్ని వారంలో 3 సార్లు తాగితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. శారీరక బలహీనతను పారద్రోలి, ఎముకలను దృఢంగా మార్చే ఈ హెల్తీ డ్రింక్ తయారీ విధానం, దాని ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కాల్షియం లోపం అనేది కనపడుతుంది. కాల్షియం లోపం కారణంగా నీరసం, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఏ పని చేయాలనీ అనిపించదు. అలాగే కీళ్లనొప్పులు,నడుము నొప్పి వంటివి కూడా వస్తాయి. శరీరంలో అలసట మరియు బలహీనత అనుభూతి ఎక్కువగా ఉంటుంది.
gasagasalu uses
రక్తహీనత,నిద్రలేమి సమస్యలు కూడా అధికం అవుతాయి . ఇప్పుడు చెప్పే చిట్కాను వారంలో మూడు సార్లు తీసుకుంటే ఆ సమస్యల నుండి బయట పడవచ్చు. ఇప్పుడు చెప్పే పాలను తయారుచేసుకోవడం కూడా చాలా సులువు. కాస్త శ్రద్ద,ఓపిక ఉంటే సరిపోతుంది.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 10 ఫుల్ మఖానలను వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గసగసాలను వేయాలి. 5 నిమిషాలు మరిగాక దానిలో చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం పాటు మరిగించి గ్లాస్ లో పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను రాత్రి సమయంలో తీసుకుంటే మంచిది.

ఆహారం తీసుకున్నాక రెండు గంటల తర్వాత పడుకోవటానికి అరగంట ముందు తీసుకోవాలి. వారంలో మూడు రోజులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకుంటే మీ శరీర బలహీనతను తొలగిస్తుంది, మీ ఎముకలను బలంగా చేస్తుంది మరియు మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది. రక్తహీనత,నిద్రలేమి సమస్యలను కూడా తొలగిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."