డై అవసరం లేదు: ఈ ఒక్క నాచురల్ చిట్కాతో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!
White Hair To Black Hair: తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే బెస్ట్ న్యాచురల్ హోమ్ రెమెడీ (White hair to black hair naturally). ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, జుట్టు కుదుళ్లను బలపరిచి సహజమైన నలుపు రంగును అందించే ఈ సింపుల్ చిట్కా తయారీ విధానం ఇక్కడే చదవండి.
తెల్లజుట్టు సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే మనలో చాలా మంది తెల్లజుట్టు రాగానే చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు.

మిక్సీ జార్ లో ఒక స్పూన్ kalonji seeds,ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కాఫీ పొడి,రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక కప్పు ఆవ నూనె పోసి కాస్త వేడి అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి 7 నుంచి 10 నిమిషాల వరకు మరిగించాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ గోరింట పొడి వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

