Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారికి అవకాడో ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదలరు!

Avocado good for diabetics : షుగర్ అనగానే ఏ పండు పడితే ఆ పండు తినడానికి భయపడతాం కదా! మరి టేస్టీగా ఉండే ‘అవకాడో’ సంగతేంటి? మధుమేహం ఉన్నవాళ్లు దీన్ని అసలు తినొచ్చా? తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

ఇందులో ఉండే ‘గుడ్ ఫ్యాట్స్’ మన షుగర్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాయో, ఎంత మోతాదులో తినాలో ఈ ఆర్టికల్‌లో చాలా వివరంగా తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం అనేది డయాబెటిస్ నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే తప్పనిసరిగా ఆహారం విషయంలో శ్రద్ద పెట్టాలి. ఇక డయాబెటిస్ ఉన్నవారు అవకాడో తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
Diabetes diet in telugu
అవకాడోలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం అనేవి కూడా డయాబెటిస్ ఉన్నవారికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తొందరగా పెరుగుతాయి.

అలా పెరగకుండా అవకాడోలో ఉన్న పోషకాలు సహాయపడతాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో నరాల దెబ్బతినడం అనేది ఒక సాధారణ సమస్య. అవకాడోలో ఉండే విటమిన్ B6 మరియు యాంటీఆక్సిడెంట్లు వంటివి నరాలు దెబ్బతినకుండా నిరోధించి, నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడతాయి.

డయాబెటిస్ ఉన్నవారిలో డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం మరియు గ్లాకోమా కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అవకాడోలో కళ్లను రక్షించే లుటీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."