Healthhealth tips in telugu

పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నారా? నిమిషంలో ఉపశమనం ఇచ్చే అద్భుతమైన ఆకు!

Munagaku Benefits In Telugu : పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పి (Period Cramps) చాలామంది మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పితో ప్రతి నెలా పడే టెన్షన్ అంతాఇంతా కాదు. అయితే, ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన మార్పులతో ఈ నొప్పిని నిమిషాల్లో ఎలా తగ్గించుకోవచ్చో ఈ బ్లాగ్‌లో తెలుసుకుందాం.

నెలసరి నొప్పులను తక్షణమే తగ్గించడంలో సహాయపడే ఆ అద్భుతమైన ఆకు ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించాలి? మరియు పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే పూర్తి వివరాల కోసం ఈ పూర్తి కథనాన్ని చదవండి!

పీరియడ్స్ సమయంలో చాలా మందికి కడుపునొప్పి వస్తూ ఉంటుంది. అసలు ఇలా రావటానికి కారణం ఏమిటో తెలుసుకొని పరిష్కారం గురించి కూడా తెలుసుకుందాం. హర్మన్స్ అసమతుల్యత ,వంశ పారంపర్యం వలన కూడా కడుపునొప్పి రావచ్చు. హార్మోన్స్ అసమతుల్యత మన ఆలోచనల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
Drumstick leaves benefits in telugu
ఈ విషయాలు తెలియక మనలో చాలా మంది కడుపునొప్పి రాగానే మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం. ఆలా టాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఉంది. ఈ చిట్కా కోసం మనకు కావలసిన ఇంగ్రిడియన్స్ అన్ని మనకు అందుబాటులో ఉంటాయి. అవి మునగాకు మరియు మిరియాలు.

ఈ రెమిడీ కోసం మునగాకును పొడిగా వాడవచ్చు లేదా ఆకు రూపంలోగాని వాడవచ్చు. ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ మునగాకు పొడి,మూడు మిరియాలు వేసి అరగ్లాసు నీరు అయ్యేవరకు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి త్రాగాలి. ఈ విధంగా పీరియడ్స్ సమయంలో ఉదయం, సాయంత్రం, రాత్రి మూడు పూటలా ఈ కషాయాన్ని త్రాగాలి.

ఈ విధంగా తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మునగాకు మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది. అలాగే మిరియాలను రెగ్యులర్ గా మనం వంటగదిలో వాడుతూనే ఉంటాం. కాబట్టి కాస్త శ్రద్ద, సమయాన్ని పెడితే మంచి ఫలితం వస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."