బజ్జీలు, వడలు వేయించిన నూనెను పారబోస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ఉపయోగాలు మీకోసమే!
Useful Cooking Tips in Telugu:పండుగలు వచ్చినా, ఇంట్లో ఏదైనా స్పెషల్ డే జరిగినా బజ్జీలు, వడలు, పూరీలు లాంటి డీప్ ఫ్రై వంటకాలు చేయడం సహజం. అయితే, ఇవి వేయించిన తర్వాత కడాయిలో మిగిలిపోయిన నూనెను చూస్తే ఏ గృహిణికైనా ఒక పెద్ద సందేహం వస్తుంది.
ఈ నూనెను పారబోయాలంటే మనసొప్పదు, అలాగని మళ్లీ వాడాలంటే ఆరోగ్యానికి మంచిదో కాదో అన్న భయం. మీకూ ఇలాంటి సందేహమే ఉంటే, ఈ పోస్ట్ మీకోసమే! మిగిలిన నూనెను వృధా చేయకుండా, సురక్షితంగా మరియు స్మార్ట్‌గా ఎలా తిరిగి ఉపయోగించుకోవచ్చో తెలిపే అద్భుతమైన కిచెన్ టిప్స్ (Kitchen Tips) గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మనం సాధారణంగా మూకుడులో ఫ్రై చేసినప్పుడు లేదంటే వడ, బజ్జి, స్నాక్స్ వంటి వాటిని తయారు చేసినప్పుడు నూనె మిగిలిపోతూ ఉంటుంది. ఈ నూనెను చాలా మంది పాడేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది కూరలకు తాలింపు పెట్టటానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ నూనెను చాలా రకాలుగా వాడవచ్చు.
కచోరి వంటి వంటకాలకు పిండిని తయారు చేయటానికి ఈ నూనెను ఉపయోగించవచ్చు. తలుపులు మరియు కిటికీలకు గ్రీజు చేయటానికి ఈ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెను sprey బాటిల్ లో పోసి తలుపులు మరియు కిటికీల హుక్స్ మరియు కీళ్లపై స్ప్రే చేస్తే సరిపోతుంది.
ఈ నూనెను ఒక డబ్బాలో పోసి మొక్కల దగ్గర పెడితే ఈ నూనె వాసనకు కీటకాలు మొక్కల దగ్గరకు రావు. అంతేకాక మిగిలిన నూనెను దీపాలను వెలిగించటానికి కూడా ఉపయోగించవచ్చు. మరి ఇప్పటి నుంచి మిగిలిన నూనెను పాడేయకుండా వాడటానికి ప్రయత్నం చేయండి.

