వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలి? 14నా, 15నా? పూర్తి క్లారిటీ ఇదే!
హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. శివపార్వతుల ముద్దుల పట్టి అయిన గణనాథుడి పుట్టినరోజును ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి రోజున జరుపుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా పండుగను ఏ రోజున జరుపుకోవాలనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి.
మరి 2026లో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 14 వ తేదీనా లేక 15 నా? అసలు చవితి తిథి ఎప్పుడు మొదలవుతుంది? అనే పూర్తి వివరాలు మీకోసం..
సెప్టెంబర్ 14 ఆ.. 15 ఆ.. క్లారిటీ ఇదే!
హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది భాద్రపద శుక్ల పక్ష చవితి తిథి రెండు రోజుల పాటు విస్తరించి ఉంది. కచ్చితమైన సమయాలు ఇలా ఉన్నాయి:

చవితి తిథి ప్రారంభం: సెప్టెంబర్ 14 (సోమవారం) ఉదయం 7:06 గంటలకు.
చవితి తిథి ముగింపు: సెప్టెంబర్ 15 (మంగళవారం) ఉదయం 7:44 గంటలకు.
సూర్యోదయానికి చవితి తిథి ఉండటం మరియు రోజంతా వ్యాపించి ఉండటం వల్ల సెప్టెంబర్ 14వ తేదీ (సోమవారం) నాడే వినాయక చవితి పండుగను జరుపుకోవడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఒకవేళ 14వ తేదీన పండుగ చేసుకోలేని వారు, సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలలోపు కూడా పూజలు నిర్వహించుకోవచ్చు.
ఈసారి వరుసగా మూడు రోజులు సెలవులు!
గణేష్ చతుర్థి వేడుకలకు ఈసారి మరో ప్రత్యేకత తోడైంది. పండుగ సోమవారం రావడంతో విద్యార్థులకు, ఉద్యోగులకు భలే కలిసొచ్చింది. శని, ఆదివారాలకు తోడు సోమవారం పండుగ సెలవు రావడంతో వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది.
11 రోజుల పాటు గణనాథుడికి పూజలు
సెప్టెంబర్ 14న వాడవాడలా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్యకు భక్తులు నవరాత్రులతో పాటు అనంత చతుర్దశి వరకు (11 రోజుల పాటు) ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసం మొత్తం గణపతి ఆరాధనకు ఎంతో విశేషమైనది. పండుగకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు అప్పుడే పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

