కాకరకాయ చేదు అని పిల్లలు తినట్లేదా? పోషకాలు పోకుండా ఇలా వేపుడు చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!
Bitter Gourd Fry:కాకరకాయ ఫ్రై.. కాకరకాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వారంలో ఒక సారైనా కాకరకాయ ప్లాన్ చేసుకోండి.ఆరోగ్యాన్ని పెంచుకోండి.
కాకరకాయ (Bitter Gourd) ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ చేదుగా ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతో పిల్లలే కాదు, చాలామంది పెద్దలు కూడా దీన్ని తినడానికి ఇష్టపడరు.
అయితే కాకరకాయలోని పోషక విలువలు ఏమాత్రం తగ్గకుండా, అసలు చేదు అనేదే లేకుండా కరకరలాడే కాకరకాయ వేపుడు (Kakarakaya Vepudu) ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఫ్రై చేస్తే, కాకరకాయ వద్దనే పిల్లలు కూడా మళ్లీ మళ్లీ అడిగి మరీ తింటారు!
కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – ¼ kg
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు – 1 ½ స్పూన్
ఉల్లిపాయలు – ½ కప్పు
పసుపు – ¼ టీ స్పూన్
కారం – 1 స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
నువ్వుల పొడి – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 7-8
తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను గుండ్రంగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి కాకరకాయ ముక్కలను వేసి వేపుకోవాలి.
3.అందులోకి ఉప్పు వేసి చేదు పోయే వరకు వేపుకోవాలి.
4.కాకరకాయలు వేగాక ఉల్లిపాయలు వేసి ,పసుపు వేసి మూతపెట్టుకోని వేపుకోవాలి.
5.ఉల్లిపాయలు వేగాక కారం,ఉప్పు,ధనియాల పొడి,నువ్వుల పొడి ,వేసి లో ఫ్లేమ్ పై పది నిమిషాలు ఉడికించుకోవాలి.
6.వెల్లుల్లి రెబ్బలను బరకగా దంచుకోని కాకరకాయ లోవేసి ఐదునిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ.
“Kakarakaya vepudu in telugu, bitter gourd fry recipe, kakarakaya fry without bitterness, healthy kakarakaya recipes in telugu, crispy kakarakaya fry, telugu cooking tips, కాకరకాయ వేపుడు, చేదు లేని కాకరకాయ ఫ్రై, హెల్తీ రెసిపీస్.”

