పిచ్చి మొక్క అని పీకేస్తున్నారా? ఈ చెట్టు ఆకులు మోకాళ్ళ నొప్పులకు సంజీవని లాంటివి!
Talambralu Chettu Benefits in telugu :మన ఇంటి చుట్టుపక్కల, రోడ్ల వెంబడి సహజంగా పెరిగే ‘తలంబ్రాల చెట్టు’ (Talambrala Chettu) అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది దీనిని ఎందుకూ పనికిరాని పిచ్చి మొక్క (Weed) అనుకుని పీకి పారేస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పిని తగ్గించడంలో తలంబ్రాల చెట్టు ఆకులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. నొప్పులను ఇట్టే లాగేసే ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి? దీని వెనుక ఉన్న ఆయుర్వేద రహస్యాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
మన చుట్టు పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటి గురించి మనకు తెలియక వాటిని పిచ్చిమొక్కలుగా భావిస్తాము. వాటిలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి మొక్కలలో ఒకటి తలంబ్రాల మొక్క. ఈ చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది.

దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి.కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టుని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు. ఈ చెట్టు రోడ్డు పక్కన పొలాల గట్ల మీద ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. ఈ చెట్టును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తలంబ్రాల చెట్టు ఆకుల్లో క్రిమినాశక, యాంటీమైక్రోబయాల్ లక్షణాలున్నాయి.
అందువల్ల గాయాలను నయం చేయటానికి చాలా బాగా సహాయపడతాయి. మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులను తగ్గించటానికి కూడా బాగా సహాయపడతాయి. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చే సరికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులను తగ్గించటానికి పెయిన్ కిల్లర్స్ బదులు ఈ సింపుల్ చిట్కాని ఫాలో అవ్వండి.
తలంబ్రాల చెట్టు ఆకులను ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పైపూతగా రాసి ఒక క్లాత్ తో గట్టిగా కట్టాలి. ఇలా నెల రోజులపాటు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వెన్నునొప్పి, రుమాటిజం, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చివరగా దోమలను నివారించడంలో ఉపయోగపడుతుంది. దీని ఆకులను ఎండబెట్టి పొగ బెడితే దోమలు పారిపోతాయి. తలంబ్రాల చెట్టు ఆకుల్లో మిథనాలిక్ అండ్ ఇథనాలిక్ గుణాలు ఉండటం వలన దోమలు, కీటకాలు వెంటనే పారిపోతాయి. ఈ కాలంలో దోమల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆకులను ఉపయోగించవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
“Talambrala chettu uses in telugu, knee pain home remedies in telugu, joint pain relief tips telugu, lantana camara medicinal uses, ayurvedic tips for knee pain, మోకాళ్ళ నొప్పులు తగ్గించే చిట్కాలు, తలంబ్రాల చెట్టు ఉపయోగాలు, ఆయుర్వేద చిట్కాలు.”

