వినాయక చవితి పండుగ: పూజకు ఏయే వస్తువులు కావాలో ముందే సిద్ధం చేసుకోండి!
Vinayaka chavithi: వినాయక చవితి వచ్చేసింది! తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడి వ్రతాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలి? పూజకు కావాల్సిన వస్తువులు, పత్రి మరియు వ్రత కథ పూర్తి వివరాలు మీకోసం.
వినాయక చవితి వచ్చేసింది…వినాయకడి పూజకు అవసరమైన సామాగ్రి ఇవే.. వినాయక చవితి సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా గణపతి పూజ కోసం ఆలయాలు సిద్ధమవుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా గణనాథుడిని ఊరూ వాడా భక్తి, శ్రద్ధలతో పూజించనున్నారు. ఈ నేపథ్యంలో పూజకు అవసరమైన సామాగ్రి గురించి తెలుసుకుందాం!

వినాయక చవితి పూజా సామాగ్రి
వినాయకుడి ప్రతిమ, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూల దండలు, తమలపాకులు, అరటిపండ్లు, వక్కలు, కర్పూరం, అగరబత్తులు, గంధం, కొబ్బరికాయలు, బెల్లం, తోరము, దీపారాధన కుందులు, వత్తులు, నెయ్యి, పంచామృతం, పత్రి, ఉండ్రాళ్ళు, కర్పూర బిళ్లలు, అగ్గిపెట్టె, ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్ధరిణి, కలశం కోసం చెంబు, నీళ్లు, వినాయకుడి ఆసనం, వినాయకునికి వస్త్రం, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు. ఇవి కాకుండా, మరికొన్ని ఇతర సామాగ్రి కూడా పూజకు అవసరం కావచ్చు.
వినాయకుడి పూజకు 21 పత్రాలు
గణనాథుడి పూజలో పత్రి చాలా ముఖ్యం. వీలైతే 21 రకాల పత్రాలను సేకరించడం ఉత్తమం. అవి: మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం (మారేడు దళం), దూర్వారయుగ్మము (గరిక), దత్తూర పత్రం, బదరీ పత్రం (రేగు ఆకు), అపామార్గపత్రం, తులసీపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుకాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రం, సింధువారపత్రం, జాజీపత్రం, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్తపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

