Healthhealth tips in telugu

పల్లెటూళ్లలో ఎక్కడపడితే అక్కడ దొరికే ‘మల్బరీ’ పండ్లలో ఇన్ని లాభాలున్నాయా? తెలిస్తే అస్సలు వదలరు!

mulberry fruit benefits : పల్లెటూళ్లలో చెట్ల మీద సహజంగా పండే ‘మల్బరీ పండ్లు’ (Mulberry Fruit) రుచికి ఎంతో తీయగా, అద్భుతంగా ఉంటాయి. కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతాఇంతా కాదు. మల్బరీ పండ్లను ఆయుర్వేదంలో ఒక ‘సంజీవని’లా భావిస్తారు.

ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా అడ్డుకోవడంలో, వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో మల్బరీ అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో మొండి వ్యాధులకు చెక్ పెట్టే ఈ అద్భుతమైన మల్బరీ పండ్ల ప్రయోజనాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

మల్బరీ పండ్లు గురించి తెలిసిన వీటిని తినటానికి చాలా మంది ఆసక్తి చూపరు. వీటిని ఎక్కువగా షర్బత్ లు, స్వ్కాష్ లు, జెల్లీలు, సలాడ్స్ వంటి వాటిలో వాడుతూ ఉంటారు. మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉన్నాయి. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి.
mulberry fruit
ఈ పండ్లలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మల్చరీలలో రెస్వెరట్రాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

అంతేకాకుండా రెస్వెరట్రాల్‌ నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అది ఒక వేసోడైలేటర్‌ గా పని చేసిన రక్త నాళాలను సడలించేలా చేస్తుంది.
మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేయటమే కాకుండా శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేయటంలో సహాయపడుతుంది.

వీటిల్లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ వేగంగా జరిగేలా చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండేలా చేసి మన శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినవచ్చు. ఇందులో ఉండే ప్లాస్మా రక్తంలో గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. నరాలు బలహీనంగా లేకుండా బలంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.

వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. .జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ పండ్లు డ్రై రూపంలో కూడా లభ్యం అవుతాయి. వారంలో రెండు సార్లు ఈ పండ్లను తింటే ఈ పండులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

“Mulberry fruit benefits in telugu, malbari pandu uses, anti aging fruits in telugu, fruits to control diabetes, blood increasing fruits, health tips in telugu, మల్బరీ పండ్ల ప్రయోజనాలు, రోగనిరోధక శక్తి పెంచే పండ్లు, షుగర్ తగ్గించే పండ్లు, తెలుగు హెల్త్ టిప్స్.”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."