Healthhealth tips in telugu

రోజుకు 2 సార్లు ఇది తీసుకుంటే చాలు.. మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ పరార్!

Urine infection Home Remedies in Telugu : మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావడం అనేది ఎవరికైనా చాలా అసౌకర్యంగా మరియు బాధాకరంగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడం లేదా శరీరంలో ఉష్ణోగ్రత (బాడీ హీట్) అమాంతం పెరిగిపోవడం వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ (UTI) వస్తుంటుంది. ప్రతి చిన్న సమస్యకు మందులు వాడటం కంటే, మన వంటగదిలో దొరికే సహజమైన వస్తువులతోనే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

రోజుకు కేవలం రెండు సార్లు మనం చెప్పుకోబోయే ఈ చిన్న చిట్కాను పాటిస్తే, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా శరీరంలోని అధిక వేడి కూడా పూర్తిగా చల్లబడుతుంది. ఇంతకీ ఆ అద్భుతమైన చిట్కా ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

ప్రస్తుత కాలంలో అనేక మంది మూత్రంలో మంట, ఇన్ ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత పెరిగి కిడ్నిల్లో రాళ్లు మరియు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (యు.టి.ఐ) ఏర్పడే అవకాశం ఉండటమే.యూటిఐ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ )అత్యంత సాధారణ సమస్య.
dhaniyalu
దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది,

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పటికబెల్లం, పావు స్పూన్ ఉప్పు వేసి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే మూడు రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది.

ఈ నీటిని తాగటం వలన యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా కరుగుతాయి. ధనియాలు,పటికబెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ధనియాలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. అలాగే మంచి నీటిని ఎక్కువగా తాగాలి. ఆకుకూరలు,పండ్లను తప్పనిసరిగా తినాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."