వరుసగా 30 రోజులు మట్టి కుండలో నీళ్లు తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతం ఇదే!
pot water benefits :పాతకాలంలో మన పెద్దవాళ్లు ఎప్పుడూ మట్టి కుండల్లోనే నీళ్లు తాగేవారు, అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కానీ ఆధునిక జీవనశైలికి అలవాటు పడి మనం ఫ్రిడ్జ్ వాటర్‌ను ఎక్కువగా వాడుతున్నాం.
చల్లదనం కోసం తాగే ఫ్రిడ్జ్ నీళ్లు గొంతు సమస్యలను, జీర్ణకోశ సమస్యలను తెచ్చిపెడితే.. అదే మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు మన శరీరానికి అమృతంలా పనిచేస్తాయి.
స్వచ్ఛమైన ఖనిజాలను (Minerals) అందిస్తూ, నీటిలోని మలినాలను గ్రహించే అద్భుతమైన గుణం మట్టి కుండకు ఉంది. ఒకవేళ మీరు కేవలం ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్ నీటిని పక్కనపెట్టి, కుండ నీరు తాగడం అలవాటు చేసుకుంటే.. మీ ఆరోగ్యపరంగా ఎలాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
మట్టి కుండలోని నీటిని త్రాగితే అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. ప్రిజ్ వాడటం వలన మనకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో ముప్పు వాటిల్లుతుంది. ఫ్రిజ్ నుంచి విడుదలయ్యే హానికారక వాయువులతో పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. ప్రిజ్ నుంచి ఉత్పత్తయ్యే హానికారక వాయువులు నేరుగా ఓజోన్ పొరపై తీరని దుష్ప్రభావాన్ని చూపుతాయి.

విద్యుత్ బిల్లు పేరిట మనకు అయ్యే ఖర్చు కూడా తెలిసిందే. వీటన్నిటికీ బోనస్ గా మన అనారోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిజ్ వాడితే గొంతు సంబంధిత వ్యాధులు, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అదే మట్టి కుండలోని నీటిని త్రాగడం వల్ల శరీరానికి సమతూకమైన చల్లదనం అందడంతో పాటుగా చెమట ద్వారా కోల్పోయిన లవణాలు ఈ నీటి ద్వారా లభించి కిడ్నీ, మెదడు చురుగ్గా పనిచేసేలా సహాయపడతాయి. సహజంగా మట్టిలో ఉండే ప్రో బ్యాక్టీరియాలు శరీరానికి లభించి అనేక యాంటీ బాడీస్ పై పోరాటం చేస్తాయి.
వందల రకాల వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే చంపివేసి మనల్ని నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ప్రిజ్ వాడకాన్ని సాధ్యమైనమేర పక్కనపెట్టి మట్టి కుండలను వాడాలని సలహా ఇస్తున్నారు. మన శరీరంలో 40 శాతం రోగాలకు కారణమైన నీటి విషయంలో తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద అనారోగ్య ప్రమాదాలను తప్పిస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

