Devotional

వినాయక చవితి పూజ: పాలవెల్లికి ఏయే పండ్లు కట్టాలి? తర్వాత వాటిని ఏం చేయాలి?

vinayaka chavithi palavelli : వినాయక చవితి అనగానే మట్టి గణపయ్య, కుడుములు, ఉండ్రాళ్లతో పాటు తప్పకుండా గుర్తొచ్చేది ‘పాలవెల్లి’. గణనాథుడి పైభాగాన రకరకాల పండ్లతో అలంకరించే ఈ పాలవెల్లి, చవితి పూజలో అత్యంత ప్రధానమైనది.

అయితే, ఈ పాలవెల్లికి పండ్లు ఎందుకు కడతారు? ఏయే పండ్లు మాత్రమే కట్టాలి? పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ పండ్లను పడేయొచ్చా లేక ప్రసాదంగా తినాలా? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అయితే పాలవెల్లి నియమాలు, దాని వెనుక ఉన్న ఆ విశేషాలేంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

వినాయకచవితి రోజు వినాయకుడికి పూజ చేసుకుంటే విఘ్నాలు ఏమి రాకుండా ఉంటాయని అందరి నమ్మకం. అందుకే చదువుకొనే పిల్లలు,వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు ఈ వినాయకచవితి పండుగను జరుపుకుంటారు. వినాయకచవితి పూజలో పాలవెల్లి చాలా ముఖ్యమైనది.

పాలవెల్లికి పండ్లను ఎవరికీ ఇష్టం వచ్చినట్టు కడుతూ ఉంటారు. అయితే ఏ పండ్లను ఏ స్థానంలో కడితే ఏ లాభం కలుగుతుందో తెలుసుకుందాం. ముందుగా పాలవెల్లిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పాలవెల్లి మధ్యలో మొక్క జొన్న, వరి, అరటి పండు ,సీతాఫలం, మామిడి పండ్లు,బత్తాయి,దానిమ్మ పండు వంటి వాటిని కట్టాలి.

వినాయకచవితి తొమ్మిది రోజులు చేసేవారు ఆ పండ్లను కాలువలో నిమజ్జనం చేయవచ్చు. వినాయకచవితి ఒక రోజే చేసే వారు ఆ పండ్లను తినవచ్చు. చాలా మంది ఈ పండ్లను దిష్టి తీసిన పండ్లగా భావిస్తారు. అయితే అది మంచి పద్దతి కాదు. మన ఇంటిలో పూజ చేసుకున్నాక మరో ముగ్గురి ఇళ్లకు వెళ్లి వినాయకుని మండపాలను దర్శించాలి.

వినాయకచవితి పూజలో కుడుములు పత్రి చాలా ముఖ్యమైనవి. వినాయకునికి పూజ చేసిన పత్రిని కాలువలో కలపాలి. వినాయక చవితి పండగ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా వీటిని పాటించాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."