కేవలం చిటికెడు పొడి.. రాత్రికి రాత్రే మీ శరీరంలో జరిగే మ్యాజిక్ చూడండి!
Sompu Weight Loss Tips in telugu :మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో ఎన్నో మలినాలు పేరుకుపోతున్నాయి. వాటిని సహజంగా బయటకు పంపడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది.
కేవలం ఒక చిటికెడు పొడిని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే చాలు.. మీ శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. బరువు తగ్గాలనుకునేవారికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఇది ఒక దివ్యౌషధం. అదెలాగో ఈ పోస్ట్‌లో చదివి తెలుసుకోండి!”
ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల తాత్కాలికంగా ప్రయోజనం ఉన్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గించుకోవటానికి ఒక పొడి తయారుచేసుకోవాలి. ఈ పొడిని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఒక పాన్ లో ఒక కప్పు ఆవిసే గింజలు,అరకప్పు జీలకర్ర, పావు కప్పు సొంపు, ఒక కప్పు కరివేపాకు వేసి వేగించి మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో పావు కప్పు పసుపు, ఒక స్పూన్ ఇంగువ, రెండు స్పూన్ల త్రిపల చూర్ణం వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి.
రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా పది రోజులు చేస్తే తేడా మీకు అర్ధం అవుతుంది. దాన్ని బట్టి ఎన్ని రోజులు తాగితే బెటర్ అనే విషయం మీకు అర్ధం అవుతుంది. ఈ పొడిలో ఉపయోగించిన వస్తువులు అన్ని సులభంగా దొరుకుతాయి.
ఈ నీటిని తాగటం వలన అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్నా కొవ్వు కరగటమే కాకుండా డయబెటిస్ నియంత్రణలో కూడా ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి కూడా బాగా పనిచేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేసి అధిక బరువు సమస్య నుండి బయట పడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

