Healthhealth tips in telugu

గ్యాస్, అజీర్ణానికి ఈ ఒక్క గ్లాస్ చాలు.. టాబ్లెట్ కంటే ఫాస్ట్ గా పనిచేసే సీక్రెట్ డ్రింక్!

Home remedies for gastric problem in telugu : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, సమయానికి తినకపోవడం లేదా బయటి ఆహారం తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి.

ఇలాంటి ప్రతి చిన్న సమస్యకీ టాబ్లెట్స్ వాడటం భవిష్యత్తులో ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, టాబ్లెట్ కంటే స్పీడ్ గా పనిచేసే ఒక అద్భుతమైన న్యాచురల్ డ్రింక్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి? దీని వల్ల మన కడుపుకి ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌డంలో ఇబ్బందులు కలుగుతాయి. కొంద‌రికి ఆహారం నెమ్మ‌దిగా జీర్ణం అవుతుంది. ఇక కొంద‌రికైతే అస‌లు జీర్ణం కాదు. దాంతో జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

అలాంటి వారు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మన ఇంటిలో దొరికే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే అజీర్ణం స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. వాటిని తీసుకుంటే జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రుగుతుంది. ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. అది ఏమిటంటే…మనం ప్రతి రోజు ఏదో ఒక రకంగా వాడే వాము. వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పావు స్పూన్ వాములో చిటికెడు ఉప్పు వేసి నములుతూ ఆ రసాన్ని మింగవచ్చు. లేదా గోరువెచ్చని నీటిలో వాము వేసి బాగా కలిపి తినవచ్చు. లేదా వాము గింజలను నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

ఈ నీటిని తాగటం వలన జీర్ణ సంబంద సమస్యలు తగ్గటమే కాకుండా డయబెటిస్ ఉన్న వారు, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి చాలా సహాయపడుతుంది. ఈ డ్రింక్ ని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."