Beauty TipsHealthhealth tips in telugu

నల్లటి పెదవులను సహజంగా గులాబీ రంగులోకి మార్చే బెస్ట్ టిప్స్.

Lip Care Tips In Telugu : నల్లటి పెదవులను గులాబీ రంగులోకి మార్చే సులభమైన ఇంటి చిట్కాలు. డార్క్ లిప్స్ సమస్యను తగ్గించి, పెదవులను మృదువుగా, అందంగా ఉంచే న్యాచురల్ రెమెడీస్ ఈ పోస్ట్‌లో పూర్తిగా తెలుసుకోండి.

మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మారుతున్న వాతావరణం, కాలుష్యం, డీహైడ్రేషన్, మితిమీరిన కెఫిన్, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వంటి కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి. చాలా మంది నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
lemon benefits
మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయిన పెద్దగా ప్రయోజనం కనపడదు. దాంతో చాలా విసుగు చెందుతారు. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ఎంత నల్లగా ఉన్నాసరే పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ వాడుతున్నాము. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార, అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ vaseline వేసి బాగా కలపాలి. బాగా కలిసిన ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పంచదారలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని అల్ట్రావైలట్ రేస్ నుంచి పరిరక్షిస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువగా తగిలిన పెదాలు బాగా నల్లగా మారతాయి.టాక్సిన్ ల నుంచి చర్మాన్ని కాపాడే గ్లైసోలిక్ యాసిడ్ చక్కెరలో ఉంటుంది. కాబట్టి నల్లని పెదాలను గులాబీ రంగులోకి మారటానికి పంచదార బాగా సహాయపడుతుంది. నాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసే నిమ్మ పెదవులపై ఉన్న ముదురు రంగును పోగొడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."