Beauty TipsHealthhealth tips in telugu

కేవలం 10 నిమిషాల్లో మీ ముఖం మెరిసిపోయేలా చేసే అద్భుతమైన చిట్కా.

Rice flour for Face Tips : కేవలం 10 నిమిషాల్లో మీ ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, టాన్ తొలగించి గ్లోయింగ్ స్కిన్ పొందే అద్భుతమైన న్యాచురల్ రెమెడీ. Dark spots removal కు సంబంధించిన ఈ బెస్ట్ హోమ్ టిప్ ను ఇప్పుడే ట్రై చేయండి.

ముఖ సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. మార్కెట్ లో దొరికే ఉత్పత్తులు కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖం మీద మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే ఖరీధైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. దీని కోసం కేవలం 5 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అన్నీ సులభంగా అందుబాటులో ఉండేవే.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ బియ్యంపిండి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక స్పూన్ గోరువెచ్చని నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖం మీద నీటిని జల్లుతూ రబ్ చేస్తూ కడగాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు. కాఫీ ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. బియ్యంపిండి చర్మం మీద మలినాలను, మృత కణాలను తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్, బాదం నూనెలో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందిస్తాయి.

ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా ప్రయత్నం చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."