రోజుకు ఒక్క లడ్డు చాలు… కీళ్లనొప్పులు, షుగర్, నీరసం పరార్!
black gram laddu benefits In telugu : వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో కీళ్లనొప్పులు, షుగర్, అలసట వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. అయితే ఖరీదైన మందులు వాడే పనిలేకుండా, మన వంటగదిలో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో చేసే ‘ఒక్క లడ్డు’తో వీటన్నింటికీ సులభంగా చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఆ అద్భుతమైన హెల్తీ లడ్డు ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్ లో వివరంగా చూద్దాం..
పప్పుధాన్యాలలో మినుములకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మినప్పప్పుతో ఇడ్లీ, దోస, వడ అలా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మినప్పప్పును వేగించి పొడి తయారు చేసుకొని దానిలో బెల్లం, నెయ్యి వేసి లడ్డు తయారు చేసుకుని రోజుకి ఒకటి తింటూ ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

జీవక్రియ రేటును మెరుగుపరిచే జీర్ణసంబంధ సమస్యలు అయినా గ్యాస్., కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
నీరసం అలసట నిస్సత్తువ లేకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా, బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి కీళ్ల నొప్పులు లేకుండా చేస్తుంది.
మినుములలో ఉండే సూక్ష్మ పోషకాలు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాలు ధమనుల్లో ఏర్పడే ఒత్తిడిని తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
మినుముల్లో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. వీటిల్లో ఉండే కరిగే ఫైబర్ ఆహారం నుంచి శరీరం పోషకాలను గ్రహించడానికి సహాయ పడుతుంది. కరగని ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా అరిగేలా చేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం తలనొప్పిని తగ్గిస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

