ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తింటే ఏమవుతుంది? లాభాలు ఇవే..
Ginger in telugu :అల్లం కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాదు, మన ఆరోగ్యానికి ఒక దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. రోజూ ఉదయం నిద్రలేవగానే, ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను నమిలి తింటే శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడటం దగ్గరి నుంచి బరువు తగ్గడం వరకు.. పరగడుపున అల్లం తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన లాభాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఘాటైన వాసన రుచి కలిగిన అల్లంను మనం ప్రతిరోజు వంటలలో వేసుకుంటూ ఉంటాం.అల్లం లేకపోతే ఆ వంటకు రుచి ఉండదు. అల్లంలో క్యాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే ఈ ప్రయోజనాలు అనేవి తీసుకునే సమయాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా పరగడుపున తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. పరగడుపున చిన్న అల్లం ముక్క లేదా అల్లం రసం తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది.
అలాగే ఉదయం సమయంలో ఉండే నీరసం, అలసట వంటివి లేకుండా హుషారుగా ఉండటమే కాకుండా రోజంతా చురుకుగా పనులను చేసుకుంటారు. గ్యాస్ ఎసిడిటీ,మలబద్ధకం,కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు చిన్న అల్లం ముక్కను తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి ఆ సమస్యల నుంచి బయటపడతారు.
కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా తొలగిపోతుంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి కూడా ఉండవు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి రోజు అల్లం తీసుకుంటేనే మంచిది. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. అప్పుడే ఇన్ ఫెక్షన్స్ నుంచి మనకు రక్షణ కలుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

