Beauty TipsHealthhealth tips in telugu

20 ఏళ్లు దాటకముందే జుట్టు ఊడిపోతోందా? అయితే మీరు అర్జెంట్‌గా ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Hair Fall Tips:చిన్న వయసులోనే జుట్టు రాలడానికి గల ప్రధాన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 20 ఏళ్ల లోపు వారు హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి పాటించాల్సిన అద్భుతమైన ఇంటి చిట్కాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

వయస్సు 20 దాటకముందే జుట్టు ఊడుతోందా..;? ఇలా చెక్ పెట్టండి..ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన జుట్టుకి సరైన పోషకాలు అందక జుట్టు రాలే సమస్య వస్తుంది. అలా జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా,ఆరోగ్యంగా పెరగాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

ఒక బౌల్ లో మనం రెగ్యులర్ గా వాడే షాంపూని తీసుకొని దానిలో ఒక స్పూన్ Multani Mitti Powder, సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరగటమే కాకుండా జుట్టు మెరుస్తుంది.

Multani Mitti జుట్టు రాలకుండా చేయటమే కాకుండా జుట్టు చివర్లు చిట్లకుండ చేస్తుంది. జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా కాపాడటంలో సహాయపడుతుంది. క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. అలాగే తల, మాడునుండి అదనపు నూనెను గ్రహిస్తుంది, దాంతో చుండ్రు సమస్య అనేది ఉండదు.

అంతే కాదు, ఇది తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచి కేశకణాలకు తగినంత బలాన్ని అంధించి ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. కాబట్టి Multani Mitti జుట్టు సంరక్షణలో చాలా సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."