Kitchenvantalu

అన్నం మిగిలిపోయిందా? అయితే ఐదే నిమిషాల్లో ఈ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చేసేయండి!

Black Gram Rice Recipe :మిగిలిపోయిన అన్నం వేస్ట్ అవుతోందని ఆలోచిస్తున్నారా? ఉదయం హడావిడిలో ఆఫీస్ లేదా స్కూల్ లంచ్ బాక్స్ కోసం కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ‘బ్లాక్ గ్రామ్ రైస్’ ఎలా చేయాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

వడ, దోశ, టిఫిన్స్ లోకి మినపప్పుతో, అన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తరతరాలుగా ఆంధ్రులు నచ్చిమెచ్చి చేసుకునే వంటకం
మీరు కూడూ చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
మిపపప్పు పొడి కోసం..

పొట్టుమినపప్పు – 1/4కప్పు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 8 నుంచి 10
పచ్చికొబ్బరి ముక్కలు – 1/4కప్పు
చింతపండు – 2 రెబ్బలు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్

అన్నం కోసం..
వండిన అన్నం – 1 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు – తగినంత
ఇంగువ – కొద్దిగా

తయారీ విధానం
1.స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని, అందులోకి నెయ్యి వేసి, వేడెక్కిన తర్వాత,మినపప్పు వేసుకుని, దోరగా వేయించుకోవాలి.
2.పప్పు వేగిన తర్వాత , మినపప్పు పొడి కోసం ఉంచుకున్న పదార్ధాలు అన్ని వేసి,ఎర్రగా వేయించుకోవాలి.
3.వేగిన పప్పును, చింతపండును, మిక్సీ జార్లోకి వేసుకుని, మెత్తని పొడి చేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ పై వేరొక బాండీ పెట్టుకుని, నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఒకోక్కటిగా వేసి, తాళింపు వేసుకోవాలి.
5. వేగిన తాళింపులోకి, గ్రైండ్ చేసుకున్న మినప్పొడిని, ఉప్పును కూడా వేసుకుని, ఒక నిముషం పాటు వేపుకోవాలి.
6. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని, వేపుకున్న పొడిలో వేసి, కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే, ఘుమఘములాడే మినపప్పు అన్నం రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."