Kitchenvantalu

ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోతున్నాయా? అయితే నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంచే ఈ సీక్రెట్ టిప్స్ మీకోసమే!

How To Store Onion in telugu:ఎక్కువగా కొన్న ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోతున్నాయా? లేదా మొలకలు వస్తున్నాయా? వంటగదిలో ఉల్లిపాయలు కనీసం నెల రోజుల పాటు పాడవకుండా, ఫ్రెష్‌గా నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన కిచెన్ టిప్స్ ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. సరైన పద్ధతిలో నిల్వ చేసి మీ డబ్బును ఆదా చేసుకోండి.

ప్రతి రోజు ఉల్లిపాయలను ఎక్కువగానే వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ వంటలకు మంచి రుచిని అందిస్తుంది. ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే ఉల్లిపాయలను ఒక్కొక్కసారి ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటూ ఉంటాం. అవి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

ఉల్లిపాయలను నిల్వ చేసే ప్రదేశంలో తేమ,నీరు లేకుండా చూసుకోవాలి. తేమ ఎక్కువగా ఉంటే తొందరగా పాడైపోతాయి. తేమ లేని ప్రదేశంలో ఉల్లిపాయలను నిలువ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లిపాయలు కాగితం సంచులలో కూడా నిల్వ చేయవచ్చు. అయితే ఆ కాగితం సంచికి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.

ఉల్లిపాయలను వేడి పదేశంలో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. అలాగే ఉల్లిపాయలను వెదురు కంటైనర్ లో కూడా విలువ చేయవచ్చు. లేదంటే నెట్ బ్యాగులలో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఈ చిట్కాలను పాటిస్తే ఉల్లిపాయలు దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."