Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా పెరగాలా? ఈ సరికొత్త హెయిర్ గ్రోత్ చిట్కా ట్రై చేయండి!

Hair Growth:ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం (Hair Fall) ఒకటి. ఒత్తుగా, పొడవుగా ఉండాల్సిన జుట్టు పలచబడిపోవడం వల్ల చాలా మందిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంటుంది. ఎన్ని రకాల నూనెలు, షాంపూలు మార్చినా జుట్టు రాలడం ఆగట్లేదా?

అయితే ఈసారి రసాయనాలతో కూడిన ఉత్పత్తులను పక్కన పెట్టి, ఈ సరికొత్త సహజమైన చిట్కాను ట్రై చేయండి. ఈ సింపుల్ పద్ధతి జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూర్చి, ఊడిపోవడాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. అంతేకాకుండా కొత్త జుట్టు వేగంగా పెరిగేలా చేసి, జుట్టును ఒత్తుగా మరియు సిల్కీగా మారుస్తుంది.

జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే సరికొత్త చిట్కా..ప్రస్తుతం ఉన్న పరిస్థితులు,సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య మనలో చాలా మందిలో కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడకుండా ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా మంచి ఫలితం కనపడుతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో 5 స్పూన్ల సగ్గుబియ్యం వేసి 5 నిమిషాలు మరిగించి చల్లారిన తర్వాత ఒక బౌల్ లోకి వడకట్టాలి. దీనిలో 5 స్పూన్ల పెరుగు,ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలటం తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

అలాగే జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది. జుట్టు చివర్లు చిట్లటం తగ్గితుంది. సగ్గుబియ్యంలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా చేస్తాయి. పెరుగు,ఆముదం జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి. వీటిని జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."