Beauty TipsHealthhealth tips in telugu

ముఖం కాంతివంతంగా, తెల్లగా మెరిసిపోవాలా? ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి!

Skin Whitening Remedies: ఎండ దెబ్బ, కాలుష్యం మరియు మారిన జీవనశైలి కారణంగా చాలా మందిలో ముఖం తన సహజమైన కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, కెమికల్స్ వాడి చర్మాన్ని పాడుచేసుకునే బదులు, ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో చర్మాన్ని మెరిపించుకోవచ్చు.

మీ ముఖం కాంతివంతంగా, మచ్చల్లేకుండా తెల్లగా మారడానికి ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి చర్మానికి మంచి పోషణను అందించి, మృతకణాలను తొలగించి సహజమైన నిగారింపును తీసుకువస్తాయి.

ముఖం కాంతివంతంగా, తెల్లగా ఉండాలంటే.. ఈ ప్యాక్స్‌ వేసేయండి.. ముఖం తెల్లగా,అందంగా ఉండాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా మనకు ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముడతలు,మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ అతి మధురం పొడి, అరస్పూన్ జాజికాయ పొడి,ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ గంధం పొడి, ఒక స్పూన్ multani mitti, అరస్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఈ పొడిని ఎక్కువగా తయారుచేసుకొని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఒక స్పూన్ పొడిలో రోజ్ వాటర్ పోసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకు రాసి పది నిమిషాలు అయ్యాక నీటిని ముఖం మీద జల్లుతు రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది.

చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని ముడతలు,మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ముఖం అందంగా ఉండటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."