ఉదయం టిఫిన్ తర్వాత ఈ చిట్కా పాటిస్తే.. పొట్ట కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
pomegranate weight Loss Tips : బొజ్జ లేదా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును (Belly Fat) తగ్గించుకోవడం చాలా మందికి ఒక పెద్ద సవాల్‌లా మారుతుంది. జిమ్‌కి వెళ్లే సమయం లేకపోయినా, కఠినమైన డైట్లు పాటించలేకపోయినా.. సహజమైనద్ధ పద్ధతులతో దీన్ని తగ్గించుకోవచ్చు.
ఈరోజు మనం ఈ ఆర్టికల్‌లో ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. ఉదయం టిఫిన్ (Breakfast) చేసిన తర్వాత ఈ చిన్న చిట్కా పాటిస్తే, మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు వేగంగా పొట్టలోని కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అధిక బరువు,శరీరంలో కొవ్వు పెరుకుపోవటం వంటి సమస్యలతో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గటమే కాకుండా పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత దానిమ్మ గింజలు లేదా దానిమ్మ గింజల జ్యూస్ తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం మధ్యలో ఎటువంటి చిరుతిళ్లు తినకుండా ఇలా దానిమ్మ గింజలు తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. దానిమ్మ గింజలలో ఉండే ఫైబర్, విటమిన్ సి ,బి వంటి పోషకాలు శరీరంలో జీవక్రియ రేటును పెంచుతాయి.
దాంతో శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. అలాగే మనం భోజనం చేసినప్పుడు సరిగ్గా అరగకపోయినా కూడా అది శరీరంలో కొవ్వుగా మారుతుంది. అటువంటి జీర్ణ సమస్యలన్నీ తొలగించడంలో దానిమ్మ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతి రోజు దానిమ్మ గింజలు లేదా జ్యూస్ తీసుకోవటం వలన హార్మోన్ల అసమతుల్యత తగ్గిపోతుంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

