Healthhealth tips in telugu

ఒక్కసారి తాగితే చాలు.. దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా సమస్యలు పరార్!

Cold And Cough : వాతావరణం మారినప్పుడల్లా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతులో గురక (Wheezing) వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే ఆస్తమా ఉన్నవారికి ఈ సమస్యలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. ఎన్ని రకాల మందులు వాడినా తరచుగా వేధించే ఈ సమస్యల నుండి శాశ్వతంగా ఉపశమనం పొందడం ఎలా?

ఇంటి ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో తయారుచేసే ఈ అద్భుతమైన హోం రెమిడీని ఒక్కసారి తాగితే చాలు.. గొంతు నొప్పి, దగ్గు మరియు ఆస్తమా లక్షణాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరిచి, శ్వాసనాళాల్లో చేరిన కఫాన్ని సులభంగా బయటకు పంపుతుంది.

దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి వచ్చాయంటే చాలా తొందరగా తగ్గవు. కొంతమందికి ఆస్తమా., ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. ఈ సమస్యలు ఉన్న వారు ఇప్పుడు .చెప్పే డ్రింక్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఐదు లవంగాలు., ఆరు మిరియాలు, పది తులసి ఆకులు, అంగుళం అల్లంను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీరు బాగా మరిగాక నీటిని .గ్లాసులోకి వడకట్టాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అవసరం అనుకుంటే తేనె కూడా కలుపుకోవచ్చు డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.

ఉదయం సమయంలో తాగితే దగ్గు., జలుబు, గొంతు నొప్పి, గొంతులో గురక వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు రోజులో రెండు సార్లు తాగవచ్చు. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవటమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అల్లం,లవంగాలు,మిరియాలు,తులసి ఆకులలో ఉన్న లక్షణాలు దగ్గు వంటి శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."